Saturday, 30 April 2016

Environmental Impacts of Homam- a Case Study (at Sridevi Veda Vidyalayamu, Srisailam)



Source : http://www.ipcbee.com/vol30/017--ICEST2012_N20012.pdf

Note: Article reproduced with written permission from the author Sri M. Narayanarao garu.

Sunday, 24 April 2016

Rescuing our Vedic Priesthood





In Telugu,

మన సాంప్రదాయిక ఎర్రర్ కరెక్షన్ కోడ్ – ఘనాపాఠం
నేటి కంప్యూటర్ నెట్వర్క్, ఇంటర్నెట్ గురించి తెలిసిన వ్యక్తులకు తప్పకుండా తెలిసున్న ఒక పాఠ్యాంశం : ఒక కంప్యూటర్ నుండి మరొక చోటకు డేటా ఎలా చేరవెయ్యాలి అని. దానికి ఒక నిర్దుష్టమైన పద్ధతి వుంది. పంపిన డేటా లో తప్పులు లేకుండా ఉండడానికి కొన్ని ఎర్రర్ కరేక్టింగ్ కోడ్ లను కూడా పంపుతాము. ఆ డేటా ను ఒక క్రమ పద్ధతిలో పంపుతాము. ఈ పద్ధతి కి ఆద్యం ఏమిటి అని ఒక సారి తరచి చూద్దాం.
అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది. వీటి మీద పరిశోధించిన శాస్త్రజ్ఞులలో మన సమూహ గౌరవ సభ్యులు శ్రీ శ్రీ వీ వీ ఎస్ శర్మ గారు వున్నారు. వారికి శిరసా ప్రణామములు. నేడు మరొక ప్రచురిత ఆర్టికల్ నుండి కొన్ని విషయాలు ఈ టపా ద్వారా పంచుకుంటున్నాను. శ్రింగేరి విద్యాభారతి ఫౌండేషన్ ద్వారా ధర్మాత్ములు డాక్టర్ యజ్ఞసుబ్రహ్మణ్యం గారు ప్రచురించిన ఈ పేపర్ నుండి విషయాలు: (http://www.brahmanworld.org/…/subramanian_rescuing_priestho…)
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును. ఇది నమ్మబుద్ధి కావడం లేదా.
ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం
1. “ I” never said she stole my money – నేను ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )
2. I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )
3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)
4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )
5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)
6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)
7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)
చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.
ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.
క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది. 
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో ) చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు. మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం. 
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
!! ఓం నమో వేంకటేశాయ !!